హరికేన్ మైఖేల్.. వణుకుతున్న ఫ్లోరిడా

Thu,October 11, 2018 08:04 AM

Hurricane Michael hits Florida with powerful winds

ఫ్లోరిడా: అమెరికాలో హరికేన్ మైఖేల్ బీభత్సం సృష్టిస్తోంది. ఫ్లోరిడా రాష్ర్టాన్ని హరికేన్ తాకింది. దీంతో బీచ్ టౌన్లు గజగజలాడుతున్నాయి. వరదల్లో ఇండ్లు మునిగిపోతున్నాయి. కొన్ని చోట్ల బలమైన గాలులకు చెట్లు కిందపడుతున్నాయి. హరికేన్ మైఖేల్‌ను మూడవ క్యాటగిరీ తుఫాన్‌గా ప్రకటించారు. సుమారు 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. చెట్టు కూలిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. అలబామా, జార్జియా ప్రాంతాల్లోనూ హరికేన్ ప్రళయం సృష్టిస్తోంది. ఇప్పటికే ఫ్లోరిడా గవర్నర్ హెచ్చరికలు జారీ చేశారు. వందేళ్లకు ఓ సారి వచ్చే హరికేన్ ఇదని ఆయన ప్రకటించారు. హరికేన్ మైఖేల్ వల్ల సెంట్రల్ అమెరికాలో 13 మంది మరణించినట్లు తెలుస్తోంది. హోండురస్‌లో ఆరుగురు, నికరాగ్వేలో నలుగురు, ఎల్‌సాల్వడార్‌లో ముగ్గురు చనిపోయారు. ఫ్లోరిడాలో తీరం వెంట ఉన్న సుమారు 4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరిలిస్తున్నారు.

1136
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles