మహింద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్‌

Tue,September 17, 2019 05:59 PM

హైదరాబాద్‌: భారీ కార్లకు పెట్టింది పేరు మహింద్రా. ఈ మధ్యకాలంలో కార్ల అమ్మకాలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో కార్ల అమ్మకాలు పడిపోయాయి. దసరా పండుగ సందర్భంగా మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్‌ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది. అన్ని డీలర్‌షిప్‌లలో ఈ డిస్కౌంట్స్‌ అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. మోడల్‌ ఆధారంగా ఈ డిస్కౌంట్స్‌ వర్తిస్తాయి. దాదాపు రూ. 52,000 నుంచి రూ. 76,500 వరకు రాయితీ లభించనుంది. ఈ సౌకర్యాలు క్యాష్‌ డిస్కౌంట్‌, ఎక్చేంజ్‌ బోనస్‌, కార్పొరేట్‌ డిస్కౌంట్‌, ఉచిత యాక్సెసరీస్‌ మరియు కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్‌ రూపంలో లభిస్తాయి.


మహీంద్రా టీయూవీ 300, మహీంద్రా కేయూవీ 100, మహీంద్రా టీయూవీ 300ప్లస్‌, మహీంద్రా బొలేరో పవర్‌ ప్లస్‌, మహీంద్రా మరాజో, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా ఎక్స్‌యూవీ 500, మహీంద్రా థార్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మోడల్స్‌పై వాటి ధరను బట్టి ఈ డిస్కౌంట్స్‌ అందుబాటులో ఉంటాయి.

3047
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles