రూ.3000 ఫింఛను పొందడం ఎలా...?

Sat,February 23, 2019 09:48 AM

how to apply Prime Minister Shram Yogi Mandhan Pension Scheme

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్‌ధన్(పీఎంఎస్‌వైఎం) పథకం అసంఘటిత రంగ కార్మికులకు ప్రయోజనకరం. కార్మికులకు కొత్తగా ప్రవేశపెట్టిన కేంద్ర పథకాన్ని అర్హులైన కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలి. కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్‌వైఎం పథకం అమలు చేస్తుంది.

ఎవరు అర్హులు..


* వీధి వర్తకులు,
* మధ్యాహ్న భోజనకార్మికులు,
* హమాలీలు,
* ఇటుకబట్టీల కార్మికులు,
* చర్మకారులు,
* చెత్త ఏరేవారు,
* ఇళ్లలో పని చేసేవారు,
* రజకులు,
* రిక్షాకార్మికులు,
* భూమి లేని పేదలు,
* వ్యవసాయ కూలీలు,
* ఇతర కార్మికులు అందరూ పీఎంఎస్‌వైఎం పథకంలో చేరవచ్చు.
* 18 నుంచి 40 ఏండ్ల వయస్సుగల అసంఘటిత రంగ కార్మికులు మాత్రమే అర్హులు.
* ఇందులో చేరిన కార్మికులు వయస్సును అనుసరించి నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాలి.
* 60 ఏండ్లు వచ్చేవరకు చెల్లిస్తే ఆ తరువాత ప్రతినెలా రూ.3వేల పెన్షన్ వస్తుంది.

8390
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles