బియర్ గ్రిల్స్ కు హిందీ ఎలా అర్థమైంది ?..సీక్రెట్ చెప్పిన ప్రధాని మోదీ

Sun,August 25, 2019 04:04 PM

How Bear Grylls understand Hindi in Man Vs Wild modi tells the secret

డిస్కవరీ ఛానల్ లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో ఫేమస్ హోస్ట్ బియర్ గ్రిల్స్‌తో ప్రధాని మోదీ సాహసాలు చేసిన విషయం తెలిసిందే. ఈ షో డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమైంది. షోలో పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, ఇతర అంశాలపై ప్రధాని మోదీకి బియర్ గ్రిల్స్‌కు చర్చ జరిగింది. అయితే తన సాహసకృత్యాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతి గాంచిన బియర్ గ్రిల్స్‌కు మాత్రం హిందీ కొత్త భాష..అతనికి అర్థం కాదు..మరి భాష రాకున్నా ప్రధాని మోదీ హిందీలో చేసే సంభాషణతో బియర్ గ్రిల్స్ షోను ఎలా విజయవంతంగా నడిపించారనే సందేహం చాలా మందిలో కలిగింది.

అయితే ఇదే విషయంపై ప్రజల్లో ఉన్న సందేహాలకు సమాధానమిచ్చారు ప్రధాని మోదీ. మన్ కీ బాత్ లో ఈ విషయమై ప్రధాని మోదీ మాట్లాడుతూ..ఇపుడున్న టెక్నాలజీ ఆధారంగా బియర్ గ్రిల్స్‌కు తనకు మధ్య సంభాషణలు కొనసాగాయని అన్నారు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో మా సంభాషణ కొనసాగుతున్నపుడు బియర్ గ్రిల్స్ చెవికి ఓ కార్డ్‌లెస్ పరికరాన్ని పెట్టుకున్నారు. నేను హిందీలో మాట్లాడిన మాటలు ఆంగ్లంలోకి ఆటోమేటిక్‌గా తర్జుమా అవడంతో బియర్ గ్రిల్స్ నా మాటలు అర్థం చేసుకునేవారు. దీంతో షోలో మా ఇద్దరి మధ్య సంభాషణ విజయవంతంగా కొనసాగిందని..ఇంత సులువుగా షో పూర్తయేందుకు ఇపుడున్న టెక్నాలజీయే కారణమని, ఇందులో పెద్ద రహస్యమంటూ ఏమీ లేదని ప్రధాని చెప్పుకొచ్చారు.

3316
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles