ప్రేమ పెళ్లి.. కూతుర్ని చంపేసిన తండ్రి

Sat,June 29, 2019 08:11 AM

honour killing woman strangled by father and brothers in chittoor

హైదరాబాద్ : తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందనే కోపంతో.. కూతుర్ని దారుణంగా చంపేశాడు ఓ తండ్రి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఊసరపెంట గ్రామానికి చెందిన గోవిందయ్య, శోకమ్మ దంపతుల కుమారుడు కేశవన్.. అదే గ్రామానికి చెందిన భాస్కర్ నాయుడు, వరలక్ష్మి దంపతుల కుమార్తె హేమావతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తక్కువ కులం యువకుడిని పెళ్లి చేసుకోవడంతో.. తమను చంపేస్తారని భయపడిన ఆ దంపతులు.. ఏడాదిన్నర పాటు ఊరికి రాకుండా వేరే దగ్గర కాపురం పెట్టారు.

వారం రోజుల క్రితం ఈ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. బాబు పుట్టిన నేపథ్యంలో తమ తల్లిదండ్రులు మారుతారేమోనని హేమావతి తన సొంత ఊరిలో భర్తతో కలిసి అడుగుపెట్టింది. ఇదే వారి పాలిట శాపమైంది. అనారోగ్యానికి గురైన పసి బిడ్డను పలమనేరు ఆస్పత్రికి తీసుకెళ్లి.. చికిత్స అనంతరం ఆటోలో తిరిగి వస్తున్నారు హేమావతి, కేశవన్. వీరిని హేమావతి తల్లిదండ్రులు, ఆమె తమ్ముళ్లు అడ్డగించారు.

బాలింత అని కూడా చూడకుండా ఆమెను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని సమీప మామిడి తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమె గొంతుకు తాడు బిగించి దారుణంగా చంపేశారు. ఆ తర్వాత కాళ్లు, చేతులు కట్టేసి అక్కడే ఉన్న బావిలో పడేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకునే లోపే హేమావతి తండ్రి, తమ్ముళ్లు పరారీ అయ్యారు. ఈ ఘటనపై కేశవన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

4774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles