వాతావరణ శాఖ హెచ్చరికలు..స్కూళ్లకు సెలవు

Mon,January 21, 2019 07:29 PM

Holiday Declared to Schools in dehradun due to IMD alert

ఉత్తరాఖండ్ : ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో భారీ వర్షంతోపాటు అక్కడక్కడా చిరుజల్లులు, మంచువర్షం కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)హెచ్చరికలు జారీ చేసింది. యూపీలోని బిజ్నోర్ , మీరట్, మోరదాబాద్, రాంపూర్, బదౌన్, ఈటా, అమ్రోహ, బరేలీ, బాగ్ పట్ జిల్లాలతోపాటు పరిసర ప్రాంతాల్లో వర్షం, చిరుజల్లులు పడనున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్, హరిద్వార్, పావురి, నైనిటాల్, ఉధం సింగ్ నగర్, ఉత్తర్ కాశీ, చమోలీ, రుద్రప్రయాగ్ ప్రాంతాల్లో హిమపాతం, మంచువర్షం పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ డైరెక్టర్ బిక్రమ్ సింగ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో డెహ్రాడూన్ లోని పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు జిల్లా యంత్రాంగం రేపు సెలవు ప్రకటించింది.

13120
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles