పాక్‌లో గురునాన‌క్ ప్యాలెస్ ధ్వంసం

Mon,May 27, 2019 01:42 PM

Historical Guru Nanak palace demolished in Pakistan

హైద‌రాబాద్: పాకిస్థాన్‌లో గురునాన‌క్ ప్యాలెస్‌ను దుండ‌గులు పాక్షికంగా ధ్వంసం చేశారు. ఆ అద్భుత క‌ట్ట‌డాన్ని వీక్షించేందుకు ప్ర‌తి ఏడాది వేలాది మంది సిక్కు ప‌ర్యాట‌కులు అక్క‌డ‌కు వెళ్లేవారు. గురునాన‌క్ భ‌వ‌నంలో ఉన్న విలువైన కిటికీలు, డోర్ల‌ను అమ్ముకున్న‌ట్లు కూడా తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఆ భ‌వ‌నం ఉన్న‌ది. ఆ ప్యాలెస్‌లో సిక్కు మ‌త వ్య‌వ‌స్థాప‌కుడు గురునాన‌క్‌తో పాటు కొంద‌రు హిందూ రాజుల చిత్రాప‌టాలు ఉన్నాయి. దాదాపు నాలుగు శ‌తాబ్ధాల క్రితం ఆ భ‌వంతిని నిర్మించి ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. లాహోర్‌కు సుమారు వంద కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న నౌరోల్ ప‌ట్ట‌ణం వ‌ద్ద గురునాన‌క్ ప్యాలెస్ ఉన్న‌ది. ప్యాలెస్‌లో సుమారు 16 భారీ సైజున్న రూమ్‌లు ఉన్నాయి. చారిత్ర‌క క‌ట్ట‌డాన్ని ధ్వంసం చేయ‌డాన్ని స్థానికులు త‌ప్పుప‌ట్టారు. ప్ర‌ధాని ఇమ్రాన్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

2580
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles