పాకిస్థాన్‌లో శక్తిపీఠం.. హింగ్లాజ్ ఆలయానికి ఎలా వెళ్లాలి : వీడియో

Sat,November 2, 2019 12:38 PM

హైద‌రాబాద్‌: పాకిస్థాన్‌లో మరో మానస సరోవరంగా హింగ్లాజ్ శ‌క్తిపీఠం ప్ర‌ఖ్యాతిగాంచింది. మాత‌ను కొలిచే భ‌క్తులు అక్క‌డ‌కు వెళ్లేందుకు ఎంతో సాహ‌సం చేస్తారు. నదీనదాలు, అడవులు, కొండలు దాటి ఆ దేవ‌త‌ను చేరుకుంటారు. పాకిస్థాన్‌లోని సతీదేవి శక్తిపీఠంగా హింగ్లాజ్ ఆల‌యం ప్రసిద్ధిగాంచింది. కరాచీకి వాయవ్యంగా 250 కిలోమీటర్ల దూరంలో హింగోల్ జాతీయ ఉద్యానం మధ్యలో హింగోల్ నది గండి సమీపంలో ఉంటుంది హింగ్లాజ్ క్షేత్రం. అరేబియా సముద్ర తీరానికి కేవలం 19 కిలోమీటర్ల దూరంలో మక్రాన్ ఎడారిలో ఈ క్షేత్రం వెలసింది. ముస్లింలలో హజ్ యాత్ర చేసేవారిని హాజీలు అన్నట్టుగానే హింగ్లాజ్ యాత్ర చేసేవారిని హింగ్లాజీ అని పిలుస్తారట. పాకిస్థాన్ లోని అతిపెద్ద హిందూ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన హింగ్లాజ్ మాత ఆల‌యంపై న‌మ‌స్తే తెలంగాణ రూపొందించిన వీడియో ఇదే.

2986
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles