15 సార్లు క‌త్తితో పొడిచారు.. గ‌న్‌తో ముఖంపై కాల్చారు

Wed,October 23, 2019 02:03 PM

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో హిందూ స‌మాజ్ పార్టీ నేత క‌మలేశ్ తివారీని దారుణంగా హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. ల‌క్నోలో శుక్ర‌వారం జ‌రిగిన ఆ సంచ‌ల‌న మ‌ర్డ‌ర్‌కు సంబంధించిన పోస్టుమార్ట‌మ్ నివేదిక వ‌చ్చింది. క‌మలేశ్‌ను దుండ‌గులు 15 సార్లు క‌త్తితో పొడిచారు. గ‌న్‌తోనూ అత‌ని ముఖంలో కాల్చారు. క‌మ‌లేశ్ మెడ‌లో రెండు లోతైన క‌త్తిపోట్లు ఉన్నాయి. అత‌ని పుర్రె వెనుక భాగంలో బ‌ల్లెట్‌ను కూడా గుర్తించారు. దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా స్వీటు బాక్సులు ఇస్తామంటూ వ‌చ్చిన ఇద్ద‌రు దుండ‌గులే.. ఈ హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అస‌ఫ‌క్ హుస్సేన్‌, మొయినుద్దీన్ ప‌ఠాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్ద‌రూ సూర‌త్ నుంచి ల‌క్నోకు వ‌చ్చిన‌ట్లు పోలీసులు తేల్చారు. గుజ‌రాత్‌కు చెందిన యాంటీ టెర్ర‌రిజం పోలీసులు వీరిని అరెస్టు చేశారు.


హ‌త్య‌కు ముందు రోజునే ల‌క్నోకు చేరుకున్న ఇద్ద‌రూ.. అక్క‌డ ఓ హోట‌ల్ రూమ్ తీసుకున్నారు. హ‌త్య త‌ర్వాత ఆ రూమ్‌లోనే వేసుకున్న దుస్తుల‌ను, వాడిన ఆయుధాల‌ను వ‌దిలేశారు. అయితే నిందితుల స్నేహితులు, బంధువుల ద్వారా ఆ ఇద్ద‌రి మూమెంట్‌ను పోలీసులు ప‌సిక‌ట్టారు. స్వీటు బాక్సు డ‌బ్బాపై ఉన్న సూర‌త్ అడ్ర‌స్ ఆధారంగా నిందితుల‌ను ఫాలోఅయ్యారు. ఇదే కేసులో మ‌రో అయిదుగురు అనుమానితుల‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌కు వ్య‌తిరేకంగా కామెంట్లు చేసినందుకే క‌మ‌లేశ్‌ను హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

4601
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles