ఈశాన్య హీరో.. హిమంత బిశ్వా శర్మ !

Sat,March 3, 2018 01:11 PM

Himanta Biswa Sarma emerges as hero for the North East BJP Show

అగర్తలా: హిమంత బిశ్వా శర్మ. ఇప్పుడు ఈయనే ఈశాన్య హీరో. నార్త్ ఈస్ట్ రాష్ర్టాల్లో బీజేపీకి లైఫ్ ఇచ్చిన నేత ఈయన. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. 2015లో ఈయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత కమల పార్టీని .. ఈశాన్య రాష్ర్టాల్లో చేరుకునేలా చేశారు. ప్రస్తుతం అస్సాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న.. హిమంత బిశ్వా శర్మ.. త్రిపుర రాష్ర్టానికి బీజేపీ ఎన్నికల ఇంచార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈశాన్యా రాష్ర్టాల్లో ఉన్న తృణమూల్, కాంగ్రెస్ పార్టీలోని టాప్ నేతలను ఆయన.. బీజేపీలోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత స్థానిక తెగలకు చెందిన పార్టీతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు త్రిపురలో హీరోగా నిలిచారు. ఇండీజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్‌టీ)తో జతకట్టడం వల్ల త్రిపురలో బీజేపీ విజ‌యం చాలా సుల‌భంగా మారింది. దీంతో మానిక్ సర్కార్‌కు ఓటమి తప్పలేదు. వాస్తవానికి బిశ్వా శర్మ బయటివాడే అయినా.. త్రిపురలో ఓటర్లను బీజేపీ వైపు మళ్లించడంలో సక్సెస్ సాధించారు. రామ్ మాధవ్, సునిల్ డియోరా, బిప్‌లాబ్ డెబ్ లాంటి స్థానికులతో కలిసి ఈశాన్య రాష్ర్టాల్లో కీలక రోల్ ప్లే చేశారు.

త్రిపురలో పాతికేళ్లుగా అధికారంలో పాతుకుపోయిన లెఫ్ట్ పార్టీల‌ను గద్దె దించ్చి బీజేపీ జెండా ఎగురవేయ‌నుంది. అక్క‌డ బీజేపీ, వామపక్షాల మధ్య పోటీ హోరాహోరీగా ఉన్న‌ప్ప‌టికీ అత్య‌ధిక స్థానాల్లో లీడింగ్ మాత్రం బీజేపీదే. క‌మ‌ల‌ కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న‌ది. మేఘాలయాలో మాత్రం భార‌తీయ జ‌న‌తాపార్టీ పార్టీ వెనుకబడిపోయింది. నాగాలాండ్‌లోనూ భాజపా కూటమి అయిన ఎన్‌డీపీపీ ముందంజ‌లో ఉంది. మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు అందిన ఫ‌లితాల ఆధారంగా చూస్తే త్రిపుర‌లో బీజేపీ 7 స్థానాల్లో విజ‌యం సాధించి, 33 స్థానాల్లో ముందంజ‌లో ఉంది. వామ‌ప‌క్షాలు 2 స్థానాల్లో గెలువ‌గా 16 సీట్ల‌లో ఆదిక్య‌త‌ను క‌న‌బ‌ర‌స్తున్నాయి. దీనిని బ‌ట్టి త్రిపురలో ఎర్ర‌ద‌ళం కోటలో క‌మ‌లద‌ళం జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌నిపిస్తున్న‌ది.

2060
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles