నవంబర్ 9న హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలుThu,October 12, 2017 04:56 PM

నవంబర్ 9న హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు

ఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నగరా మోగింది. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి అచల్‌కుమార్ జ్యోతి ఈ మేరకు ఇవాళ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. 68 స్థానాలున్న హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి 7 జనవరి, 2018తో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఈసీ ఇవాళ హిమాచల్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. పోలింగ్ నిర్వహణ నవంబర్ 9వ తేదీన జరగనుంది. డిసెంబర్ 18వ తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. హిమాచల్ రాష్ట్రంలో మొత్తం 49.05 లక్షల ఓటర్లు ఉన్నారు. 7,521 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కాగా హిమాచల్‌ప్రదేశ్‌లో 136 పోలింగ్ కేంద్రాలు తొలిసారి మహిళా సిబ్బంది పర్యవేక్షణలో పనిచేయనున్నాయి. ఈసారి ఎన్నికల పోలింగ్‌లో ఈవీఎంలతో పాటు వీవీప్యాట్స్‌ను కూడా వినియోగించనున్నట్లు ఏకే జ్యోతి తెలిపారు. దీంతో ఓటర్లు తాము ఎవరికి ఓటు వేశారో సరిచూసుకోవచ్చు. అభ్యర్థి ఖర్చు రూ. 28 లక్షలు మించకూడదని పేర్కొంది. అదేవిధంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను సైతం డిసెంబర్ 18లోగానే పూర్తిచేస్తామని సీఈసీ పేర్కొంది.

935
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS