పార్ల‌మెంట్ గేటును ఢీకొన్న ఎంపీ కారు.. హై అల‌ర్ట్‌

Tue,February 12, 2019 01:34 PM

న్యూఢిల్లీ: పార్ల‌మెంట్ గేటును ఇవాళ ఓ ఎంపీ కారు ఢీకొట్టింది. ఆ కారు ఢీకొన‌డంతో బారికేడ్లు స్వ‌ల్పంగా దెబ్బ‌తిన్నాయి. దీంతో పార్ల‌మెంట్ ప‌రిస‌ర ప్రాంతాల్లో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. సెక్యూర్టీని హుటాహుటిన పెంచేశారు. పార్ల‌మెంట్ గేటును ఢీకొట్టిన కారు.. మ‌ణిపూర్‌కు చెందిన ఎంపీ డాక్ట‌ర్ దొక్‌చ‌మ్ మేన్యాదిగా గుర్తించారు. ఈ ప్ర‌మాదం ప‌ట్ల పార్ల‌మెంట్ సెక్యూర్టీ విచార‌ణ ప్రారంభించింది. రాంగ్ రూట్లో కారు పార్ల‌మెంట్‌లోకి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించింది. డీఎల్ 12 సీహెచ్ 4897 రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్‌. ఆ కారుకు ఎంపీ స్టిక్క‌ర్ ఉంది. అయితే సెక్యూర్టీ లోపం ఎలా జ‌రిగింద‌న్న కోణంలో విచారణ ప్రారంభించారు. ఎగ్జిట్ గేటు నుంచి కారు లోప‌లికి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించింది. 2001లో పార్ల‌మెంట్‌పై ఉగ్ర‌వాదుల దాడి చేసిన విష‌యం తెలిసిందే. ల‌ష్క‌రే, జైషే సంస్థ‌ల‌కు చెందిన ఉగ్ర‌వాదులు ఆ దాడి చేశారు. ఆ దాడిలో 9 మంది చ‌నిపోయారు. ఏకే47 రైఫిళ్లు, గ్రేనేడ్లు, పిస్తోళ్లతో వ‌చ్చిన అయిదుగురు ఉగ్ర‌వాదుల‌ను ఆ త‌ర్వాత భ‌ద్ర‌తాద‌ళాలు మ‌ట్టుబెట్టాయి. ఇవాళ సెక్యూర్టీ క్లియ‌రెన్స్ లేకుండా కారు పార్ల‌మెంట్‌లోకి ప్ర‌వేశించ‌డంతో అక్క‌డ భ‌ద్ర‌త‌ను అప్ర‌మ‌త్తం చేశారు.2242
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles