సింహాల బారి నుంచి యజమానిని కాపాడిన కుక్క

Mon,July 23, 2018 01:01 PM

Heroic dog saves owner after 3 lions attack him in Gujarat

అహ్మదాబాద్ : కుక్క విశ్వాసానికి మారు పేరు. మనషులకు సాటి మనషులపై విశ్వాసం ఉంటదో.. ఉండదో తెలియదు కానీ.. శునకాలకు మాత్రం తమ యజమానులపై విశ్వాసం ఉంటుంది. అందుకు ఈ సంఘటనే నిదర్శనం. గుజరాత్‌లోని అంబార్ది గ్రామానికి చెందిన గొర్రెల యజమాని.. జులై 21న తన గొర్రెలను సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అటవీ ప్రాంతంలో గొర్రెలు మేత మేస్తుండగా.. మూడు సింహాలు వాటిపై దాడి చేశాయి. ఈ క్రమంలోనే మూడు గొర్రెలు మృతి చెందాయి. సింహాల బారి నుంచి గొర్రెలను తప్పించేందుకు యజమాని భవేష్ హామీర్ భర్వాద్(25) తీవ్ర ప్రయత్నం చేశాడు. భర్వాద్‌పై కూడా సింహాలు దాడి చేశాయి.

ఇక అక్కడున్న భర్వాద్ శునకం.. అరుస్తూ సింహాలను బెదిరించే ప్రయత్నం చేసింది. కుక్క అరుపులు విన్న స్థానికులు.. అక్కడికి క్షణాల్లో పరుగెత్తుకు వచ్చారు. జన సమూహాన్ని చూసిన సింహాలు.. అక్కడి నుంచి అడవిలోకి పారిపోయాయి. సింహాల దాడిలో భర్వాద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. భర్వాద్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సింహాలు సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

3709
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles