హేమంత్ క‌ర్క‌రే అమ‌ర‌వీరుడే : బీజేపీ ప్ర‌క‌ట‌న‌

Fri,April 19, 2019 05:52 PM

Hemant Karkare is a martyr, says BJP in a statement

హైద‌రాబాద్‌: భోపాల్ బీజేపీ అభ్య‌ర్థి ప్ర‌జ్ఞా సింగ్ థాకూర్‌.. దివంగ‌త ఏటీఎస్ ఆఫీస‌ర్ హేమంత్ క‌ర్క‌రేపై చేసిన వ్యాఖ్య ప‌ట్ల ఆ పార్టీ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఉగ్ర‌వాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన హేమంత్ క‌ర్క‌రేను అమ‌ర‌వీరుడిగా గుర్తిస్తున్న‌ట్లు బీజేపీ ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. క‌ర్క‌రేపై ప్ర‌జ్ఞా చేసిన వ్యాఖ్య‌లు వ్య‌క్తిగ‌త‌మైన‌వ‌ని పార్టీ పేర్కొన్న‌ది. త‌న‌కు జ‌రిగిన మాన‌సిక‌, శారీరిక వేధింపుల వ‌ల్లే ప్ర‌జ్ఞా అలాంటి వ్యాఖ్య‌లు చేసి ఉంటుంద‌ని బీజేపీ తెలిపింది. మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌జ్ఞాను.. ఐపీఎస్‌ ఆఫీస‌ర్ హేమంత్ క‌ర్క‌రే విచారించారు. అయితే ముంబై ఉగ్ర‌దాడిలో అత‌ను ప్రాణాలు కోల్పోయాడు. తాను శ‌పించ‌డం వ‌ల్లే క‌ర్క‌రే ఉగ్ర‌వాదుల తూటాల‌కు బ‌లైన‌ట్లు ప్ర‌జ్ఞా కామెంట్ చేశారు.



995
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles