48 గంటల్లో భారీ వర్షాలు!

Thu,April 25, 2019 11:52 AM

Heavy to very heavy rainfall expected at isolated places over Tamil Nadu and Puducherry

హైదరాబాద్‌ : తమిళనాడు, పుదుచ్చేరిలో రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక తెలంగాణ, కోస్తాంధ్రలో కూడా ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హిందూమహా సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో శ్రీలంకకు ఆగ్నేయంగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది రానున్న 36 గంటల్లో బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

6948
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles