తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు..

Fri,September 21, 2018 05:25 PM

heavy to very heavy rain very likely to occur over isolated places in Telangana

హైదరాబాద్ : తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోనూ స్వల్ప స్థాయిలో వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారి రాజా రావు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాన్ గత అర్థరాత్రి ఒడిశా తీరాన్ని దాటింది. ఇవాళ ఉదయం ఆ తుఫాన్ అల్ప పీడనంగా మారింది. దీంతో రానున్న 12 గంటల్లో అల్పపీడన ప్రభావం రెండు రాష్ర్టాలపై కనిపించనుంది.

2134
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles