కశ్మీర్, హిమాచల్‌లో విరిగిపడుతున్న కొండచరియలు

Sat,August 25, 2018 09:52 AM

heavy rainfall causes landslides in Jammu Kashmir and Himachal Pradesh


శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిని మూసివేశారు. రాంబన్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడంతో.. హైవేను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా పరిస్థితి అదుపు తప్పింది. షిమ్లా జిల్లాలోని కుట్, కుండీ, కుంచా గ్రామాల్లో.. వరదల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. రోడ్లు, బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయాయి. ఇండో టిబెట్ బోర్డర్ పోలీసులు.. ఓ పాక్షిక బ్రిడ్జ్‌ను పునర్ నిర్మించారు. అయితే ఆ బ్రిడ్జ్ మళ్లీ కురిసిన వర్షాలకు ధ్వంసం అయ్యింది.

946
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles