ఈశాన్య రాష్ర్టాల్లో వరదలు..14మంది మృతి

Thu,June 15, 2017 12:05 PM

Heavy rain in northeastern states.. many houses submerged


మణిపూర్ : ఈశాన్య రాష్ర్టాలైన మణిపూర్, మిజోరాం, అసోంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మణిపూర్‌లో భారీ వర్షాలకు పలు సరస్సులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దిగువ ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ వరద నీటిలో చిక్కుకునిపోయాయి. వరదల ధాటికి ఇప్పటివరకు ఆయా రాష్ర్టాల్లో 14 మంది మృతి చెందారు. భారీ వర్షాలకు ఇంఫాల్ నది, నంబూక్ నదుల నీటి మట్టం డేంజర్ మార్కును ధాటి ప్రవహిస్తున్నాయి.

వరదల ప్రభావంతో అసోంలోని కాంగ్‌పోక్పి జిల్లాలోని పరిసర గ్రామాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి దూరప్రాంతాలకు వెళుతున్నారు. మరోవైపు సేనాపతి జిల్లాలో పలు ప్రధాన రహదారులను వరద నీరు కప్పేయడంతో వాహనరాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో అసోం, మణిపూర్, మిజోరాం రాష్ర్టాల విపత్తు నిర్వహణా విభాగం అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
floods-assom1
floods-assom
floods-assom4
floods-assom5

1092
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles