హోంవర్క్ చేయలేదని 500ల గుంజిలు

Fri,December 15, 2017 12:03 PM

ముంబై : ఓ విద్యార్థిని హోంవర్క్ చేయలేదని.. ప్రధానోపాధ్యాయురాలు 500ల గుంజిలు తీయించింది. ఈ ఘటన నవంబర్ 24న మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. భావేశ్వరి సందేశ్ విద్యాలయం ప్రధానోపాధ్యాయురాలు ఆశ్విని దివాన్.. దీపావళి సెలవుల్లో భాగంగా విద్యార్థినులకు హోంవర్క్ ఇచ్చారు. అయితే ఆరుగురు విద్యార్థినులు మాత్రం హోంవర్క్ పూర్తి చేయలేదు. దీంతో కోపం తెచ్చుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు.. ఆరుగురికి తీవ్రమైన శిక్ష విధించింది. ప్రతి ఒక్కరూ 500ల గుంజిలు తీయాలని ఆదేశించింది. గుంజిలు పూర్తి చేసిన వారిలో ఒక విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురైంది. కుడి కాలులో తీవ్రమైన నొప్పి వస్తుందని బాధిత బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులను ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్కూల్ ప్రిన్సిపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. విద్యార్థులను శిక్షించిన ప్రధానోపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది.

1378
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles