తల ఒక చోట.. మొండెం మరో చోట.. చేతిపై నంద

Wed,September 12, 2018 09:30 AM

Headless body found in Delhi Green Park crematorium and tattoo on arm only clue

న్యూఢిల్లీ : ఢిల్లీలోని గ్రీన్ పార్క్‌కు సమీపంలో ఉన్న శ్మశానవాటికలో తల లేని మొండెం లభ్యమైంది. నగ్నంగా లభ్యమైన ఆ బాడీకి 50 మీటర్ల దూరంలో తల పడి ఉంది. చేతిపై నంద అని టాటూ రాసి ఉంది. అయితే సోమవారం రాత్రి చెత్త సేకరించే ఓ మహిళ.. శ్మశాన వాటికలో మొండెంను గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మొండెంను స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్కాడ్ తనిఖీలు చేయగా ఈ డెడ్ బాడీకి 50 మీటర్ల దూరంలో తల ఉండడాన్ని గుర్తించారు.

అయితే ఆ వ్యక్తిని అక్కడి హత్య చేసి ఉండకపోవచ్చని.. వేరే చోట హత్య చేసి ఇక్కడ పడేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చేతులు కట్టేసి.. దారుణంగా చితకబాది హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుడి చేతిపై నంద అని టాటూ రూపంలో ఉందన్నారు పోలీసులు. డెడ్ బాడీ పక్కల బ్లూ కలర్ జీన్స్, ఎరుపు, నలుపు రంగులో ఉన్న షూ ఉన్నాయి. ఇక కుడి చేతికి ప్లాస్టిక్ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్, స్టీల్ బ్రెస్‌లేట్, రాఖీ కట్టి ఉంది. అయితే ఇతడిని హత్య చేశారా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత పూర్తిస్థాయి విచారణ జరుపుతామని పోలీసులు స్పష్టం చేశారు. గ్రీన్‌పార్క్ సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

7499
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS