కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే కేక్ కోయించారు!Sun,October 15, 2017 12:47 PM
కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే కేక్ కోయించారు!

పోలీసులంటే... వాళ్లకు అసలు మానవత్వం ఉండదు. చాలా రాష్‌గా ఉంటారు. స్టేషన్‌కు వెళ్తే సరిగ్గా రెస్పాన్స్ కూడా ఇవ్వరు. ఇది.. పోలీసులపై జనాల్లో ఉన్న అభిప్రాయం. కాని.. ఆ అభిప్రాయాన్ని తప్పని నిరూపించారు ముంబై పోలీసులు. ముంబైకి చెందిన ఓ యువకుడు కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నప్పుడు అతడు త‌న డిటెయిల్స్ పోలీసుల‌కు చెబుతుండగా.. ఆయన డేట్ ఆఫ్ బర్త్ అదే రోజ‌ని తెలిసింది.

దీంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత పోలీసులు సడెన్‌గా కేక్ తీసుకొచ్చి ఆ యువకుడి బర్త్ డేను సెలబ్రేట్ చేశారు. దీంతో షాక్ తిన్న ఆ యువకుడు పోలీసులంటే పీక్కుతింటారని విన్నా కాని.. ఇంత మంచి పోలీసులుంటారని ఇప్పుడే చూస్తున్నానంటూ.. పోలీస్ స్టేష‌న్‌లో త‌న బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేయ‌డం ఎంతో సంతోషంగా ఉందంటూ చెప్పాడు. ఇక.. ఈ విషయాన్ని ముంబై పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో నెటిజన్లు ముంబై పోలీసులపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


3503
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS