ఆడవాళ్లను రెండు ముక్కలు చేస్తాడట అయ్యప్పా

Fri,October 12, 2018 07:31 PM

he threatens women who want to enter sabarimala

శతాబ్దాలుగా శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం లేదు. ఇది సరికాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు తీర్పు మంచిదే, పెద్ద ముందంజ అని ప్రశంసిస్తే మరికొందరేమో సంప్రదాయం మంటగలుపుతారా? అని భగ్గుమంటున్నారు. రెండో కోవలో కొంచెం అతి చేసేరకం కూడా ఉంటారు. అలాంటివాళ్లకి తులసీధరన్ నాయర్ అలియాస్ కొల్లాం తులసి ప్రతినిధి అని చెప్పొచ్చు. ఈయన ఓ చిన్నసైజు మలయాళీ సినీనటుడు. బీజేపీ సమర్థకుడు. తీర్పు వచ్చింది కదా అని ఎవరైనా మహిళలు శబరిమలలోకి అడుగుపెడితే రెండు ముక్కలు చేస్తాడట ఈయన. ఓ ముక్కను సీఎం కార్యాలయం ముందు, ఇంకో ముక్కను ఢిల్లీలో పారేస్తాడట. ఈయన ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే కొత్తకాదు. గతంలో కిడ్నాప్, రేప్‌కేసులో ఇరుక్కున్న దిలీప్ అనే నటునికి ఈయన వత్తాసు పలికాడు. అదీ బీజేపీ రాష్ట్రనేత హాజరైన వేదిక మీద నుంచి. తాజా వ్యాఖ్యలపై సీపీఎం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరిశీలించి చర్య తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.

4072
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles