కుమారస్వామి.. యడ్యూరప్ప.. ఏకగ్రీవ ఎన్నిక

Wed,May 16, 2018 12:17 PM

HD Kumaraswamy, BS Yeddyurappa elected as JDS, BJPs legislature leader

బెంగుళూరు: కర్నాటకలో ఎవరు సీఎం అవుతారో ఇంకా టెన్షన్‌గానే ఉంది. అయితే ఇవాళ రెండు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేడీఎస్ ఎల్పీ నేతగా హెచ్‌డీ కుమారస్వామి ఎన్నికయ్యారు. బెంగుళూరులో జరిగిన జేడీఎస్ మీటింగ్‌లో కుమారస్వామిని పార్టీ చీఫ్‌గా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ నేత మంజూనాథ్ తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, కుమారస్వామే సీఎం అవుతారని ఆయన చెప్పారు. తమపై ఎవరి ప్రభావం ఉండదన్నారు. మరోవైపు బీజేపీ కూడా తమ పార్టీ చీఫ్‌గా యడ్యూరప్పను ఎన్నుకున్నది. తమ పార్టీ తనను చీఫ్‌గా ఎన్నుకున్నట్లు యడ్యూరప్ప తెలిపారు. గవర్నర్ వాజూభాయ్ వాలాకు ఆ లేఖను సమర్పించినట్లు ఆయన చెప్పారు. గవర్నర్ తనకు ఆహ్వానం అందిస్తారని ఆశిస్తున్నట్లు యడ్యూరప్ప తెలిపారు. సరైన నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పారని బీజేపీ నేత గుర్తు చేశారు.


6888
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS