మనవడి కోసం సీటు త్యాగం చేసిన తాత..

Thu,March 14, 2019 01:23 PM

HD Deve Gowda breaks down as he says grandsons will contest Lok Sabha election

బెంగళూరు : మాజీ ప్రధానమంత్రి, జనతా దళ్(సెక్యూలర్) నాయకుడు హెచ్‌డీ దేవేగౌడ తన మనువడి కోసం లోక్‌సభ సీటును త్యాగం చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ.. హసన్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారని చెబుతూ.. దేవేగౌడ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఆయన పక్కనే ఉన్న మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కూడా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. చెన్నకేశవ స్వామి, పార్టీ కార్యకర్తల ఆశీర్వాదం ప్రజ్వల్‌కు ఉండాలన్నారు. దేవేగౌడ మరో మనవడు నిఖిల్ కుమారస్వామి కూడా మండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ.. మంత్రి హెచ్‌డీ రేవణ్ణ కుమారుడు కాగా, నిఖిల్.. సీఎం కుమారస్వామి కుమారుడు.3588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles