పదేళ్ల జైలు శిక్షను సమర్థించిన ముంబై హైకోర్టు

Thu,May 16, 2019 03:59 PM

HC Upholds man sentence for raping a minor girl


ముంబై: బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడికి ట్రయల్ కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను ముంబై హైకోర్టు సమర్థించింది. 2011 నవంబర్‌లో పశ్చిమబెంగాల్‌కు చెందిన అరాబలి అష్రఫ్ ముల్లా పదిహేనేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అష్రఫ్ ముల్లా ఆ తర్వాత ఆ బాలికను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం అష్రఫ్ ముల్లా ఆ బాలికను డోంగ్రీ ప్రాంతంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి..బలవంతంగా వ్యభిచారకూపంలోకి దించాడు. కొన్ని రోజుల తర్వాత బాధిత బాలిక తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది.

బాలిక తల్లి ఫిర్యాదుతో ముంబై పోలీసులు అష్రఫ్ ముల్లాను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బాలికను అత్యాచారం చేయడమే కాకుండా..ఆమె జీవితాన్ని నాశనం నిందితుడు అష్రఫ్ ముల్లాకు 2015లో ట్రయల్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. నిందితుడు అష్రఫ్ ముల్లా ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ముంబై హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు అరాబలి అష్రఫ్ ముల్లాకు ట్రయల్ కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను సరైనదేనని తేల్చి చెప్పింది.

1418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles