వీకెండ్ బోర్ కొడుతుందా.. ఈ సూప‌ర్బ్ డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేయండి!

Sat,April 21, 2018 03:43 PM

Have you seen this upbeat dance Jaani Tera Naa

ఈ వీకెండ్ అంతా బోరింగ్‌గా ఉందా.. ఓ మాంచి బీట్ సాంగ్ వేసుకొని ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారా? అయితే.. మీలాంటి వాళ్ల కోసమే ఈ వార్త. అవును. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ సొనాలి భదువారియా, డ్యాన్సర్ గౌరవ్ తుక్రాల్ ఇద్దరు కలిసి పంజాబ్ సాంగ్ 'జాని తేరా నా' కు డ్యాన్స్ పర్‌ఫార్మ్ చేసి అదరహో అనిపించారు. ముఖ్యంగా డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్ చేసే వెనక బ్యాక్ గ్రౌండ్ మాత్రం ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను న్యూఢిల్లీలోని పిక్చర్ స్కీ జుగుముగ్ తేలాలో షూట్ చేశారు. ఇక.. యూట్యూబ్‌లో షేర్ చేసిన ఒక్కరోజులోనే వీడియో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. వీకెండ్‌లో అద్భుతమైన డ్యాన్స్ చేసి అదరగొట్టారు.. అంటూ నెటిజన్లు వాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి..


జాని తేరా నా సాంగ్ అసలు వీడియో ఇదే...

3976
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles