అనుష్క శర్మ జిరాక్స్ ఈ యువతి.. అచ్చు గుద్దినట్టు ఉంది..!

Mon,February 4, 2019 07:44 PM

Have you seen Anushka Sharma Doppelganger who is a native of America

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మను పోలిన యువతి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అచ్చు గుద్దినట్టు అనుష్కలాగానే ఉంది ఆ యువతి. మీకు డౌట్ ఉంటే పైన ఫోటో చూడండి. మీకే అర్థమవుతుంది.అమెరికన్ సింగర్ అయిన జులియా మైకెల్‌ను చూసి అరె.. అచ్చం అనుష్క లెక్కనే ఉందని ఓ ట్విట్టర్ యూజర్ ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. అనుష్క శర్మను ట్యాగ్ చేసింది. అంతే.. ఇద్దరి ఫోటోలను చూసి నెటిజన్లు కూడా ఎవరు నిజంగా అనుష్కానో గుర్తు పట్టలేక నోరెళ్లబెడుతున్నారు. 25 ఏళ్ల జులియా ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన నెటిజన్లు.. వెంటనే అనుష్క శర్మతో పోల్చడం ప్రారంభించారు. అలా సోషల్ మీడియాలో ఈ సింగర్ ఫోటో వైరల్‌గా మారింది. వైర‌ల్‌గా మారిన త‌న ఫోటో గురించి తెలుసుకున్న మైకెల్‌.. త‌న‌ను ఫేమ‌స్ సెల‌బ్రిటీతో పోల్చినందుకు... ఓవ‌ర్ నైట్ స్టార్ చేసినందుకు ట్విట్ట‌ర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ ట్వీట్ చేసింది.


12257
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles