ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ఆవు పెండతో కారుకు పూత.. వైరల్ ఫోటోలు

Fri,May 24, 2019 07:33 PM

సాధారణంగా కార్లకు నలుపు, తెలుపు, ఎర్రటి రంగులు వేసుకుంటారు. కానీ.. ఈ మహిళ మాత్రం తన కారుకు ఆవు పెండతో కోటింగ్ వేయించింది. ఆశ్చర్యంగా ఉందా? నమ్మలేకపోతున్నారా? కాని.. మీరు నమ్మాల్సిందే. ఇది అసలే ఎండాకాలం. కారులో ప్రయాణం చేసినా ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నారు జనాలు. ఏసీ కూడా సరిపోవట్లేదు.

అందుకే ఓ మహిళ భలే ఆలోచన చేసింది. తనకున్న టయోటా అల్టిస్ కారుకు ఆవు పెండతో పూత పూయించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సెజల్ షా.. ఎండ వేడి నుంచి తప్పించుకోవడం కోసం ఈ వినూత్న ప్రయోగం చేసి సక్సెస్ అయింది.

ఇప్పుడు కారులో ఏసీ లేకున్నా.. హాయిగా.. చల్లగా ఎండలో తిరుగుతోంది సెజల్. సాధారణంగా ఇంటి ముందు పేడ నీళ్లు చల్లిన తర్వాత గేటు ముందు ఎలా అలికి ముగ్గేస్తారో.. ఆమె కూడా తన కారు మొత్తాన్ని పెండతో పూత పూయించి.. కారు చివర్లో ఎర్రటి, తెలుపు రంగులతో ముగ్గుల డిజైన్ల వేసింది.

ఇలా ఆవు పెండతో అలకడం వల్ల కారు చల్లగా ఉండటమే కాదు.. కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే.. నేను కారులో ఏసీ వాడను. ఏసీ వాడటం వల్ల ఏసీ నుంచి రిలీజ్ అయ్యే ఎన్నో రకాల హానికారకమైన విషవాయువులను విడుదల కాకుండా నేను ఆపి పర్యావరణాన్ని కాపాడుతున్నా. గోబ్లల్ వార్మింగ్ అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. భూగోళాన్ని మన చేజేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాం. అందుకే రోజురోజుకూ భూమి విపరీతంగా వేడెక్కుతోంది. అందుకే.. పర్యావరణాన్ని కాపాడటానికి నావంతు కృషి చేస్తున్నా.. అంటూ చెప్పుకొచ్చింది సెజల్.

ఇంతకీ కారుకు ఆవు పెండ పూయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది?


సాధారణంగా ఆవు పెండ కలిపిన నీళ్లను ఇంటి ముందు చల్లుతాం. గోడకు పూస్తుంటాం. ఇంట్లోనూ ఆవు పెండతో అలుకుతుంటాం. దీని వల్ల ఇల్లు చల్లగా ఉంటుంది. ఆవు పెండ ఉష్ణాన్ని గ్రహించి చల్లదనాన్ని వదులుతుంది. ఇదే ఫార్ములాను నేను నా కారుకూ ఉపయోగించా. సక్సెస్ అయ్యా.. అని చెప్పింది.

ఆవు పెండ పూసిన కారు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


3865
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles