అక్టోబర్‌ 21న మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు

Sat,September 21, 2019 12:29 PM

న్యూఢిల్లీ : మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరా ప్రకటించారు. ఈ సందర్భంగా సునీల్‌ ఆరోరా మాట్లాడుతూ.. అక్టోబర్‌ 21న మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రెండు రాష్ర్టాల్లో అక్టోబర్‌ 24న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఈ రెండు రాష్ర్టాల ఎన్నికల నోటిఫికేషన్‌ సెప్టెంబర్‌ 27న విడుదల కానుందని ఆయన చెప్పారు. నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్‌ 4. హర్యానా అసెంబ్లీకి నవంబర్‌ 2వ తేదీతో, మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌ 9వ తేదీతో గడువు ముగియనుంది అని తెలిపారు. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. మహారాష్ట్రలో 8.94 కోట్ల మంది, హర్యానాలో 1.82 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన గడ్చిరోలి, గొండియాలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక ఎన్నికల ప్రచారానికి ప్లాస్టిక్‌ వస్తువులను వినియోగించొద్దని రాజకీయ పార్టీలకు సునీల్‌ ఆరోరా సూచించారు.679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles