ముంబై ఎయిర్‌పోర్ట్ ప్రపంచ రికార్డు

Sun,November 26, 2017 10:23 PM

Handling 969 Flights in 24 Hours Mumbai Airport Sets New World Record

ముంబై: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. శుక్రవారం ఒక్కరోజే ఒకే రన్‌వేపై 969 విమానాల రాకపోకలను నిర్వహించింది. తద్వారా ఒకే రన్‌వే ఉన్న విమానాశ్రయాల్లో అత్యధికంగా రాకపోకలను నియంత్రించిన విమానాశ్రయంగా రికార్డు నెలకొల్పింది. గతంలో తన పేరిటే ఉన్న 935 విమానాల రాకపోకల నిర్వహణ రికార్డును తాజా ఘనతతో తిరగరాసింది. మహానగరాలైన న్యూయార్క్, లండన్, దుబాయ్, ఢిల్లీ విమానాశ్రయాల్లో రెండుకు పైగా రన్‌వేలు ఉన్నాయి. అక్కడ వేర్వేరు రన్‌వేలపై ఏకకాలంలో రాకపోకలను నియంత్రిస్తారు. ముంబైలో కూడా రెండు రన్‌వేలు ఉన్నప్పటికీ ఒకదానిపై నుంచి ఒకటి అడ్డంగా ఉండటంతో ఒకేసారి రెండు రన్‌వేలను ఉపయోగించడానికి వీలుపడదు. దీంతో ముంబై విమానాశ్రయం ఒకే రన్‌వే ఉన్న విమానాశ్రయాల జాబితాలో చేరిపోయింది. ఈ విమానాశ్రయానికి రోజూ దాదాపు 900 విమానాలు వచ్చిపోతుంటాయి. కాగా షెడ్యూల్‌లో లేకుండా అనుకోకుండా వచ్చిన విమానాల వల్ల శుక్రవారం రోజు అత్యధిక ఎయిర్ ట్రాఫిక్ నమోదైనట్టు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ అధికార ప్రతినిధి తెలిపారు. త్వరలోనే వెయ్యి విమానాల రాకపోకలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.

2078
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles