జర్నలిస్ట్ రామ్ చంద్ర హత్యకేసు..గుర్మీత్ సింగ్ కు జీవితఖైదు

Thu,January 17, 2019 06:59 PM

Gurmeet singh gets life imprisonment in journalist murder case

హర్యానా: జర్నలిస్ట్ రామ్ చంద్ర ఛత్రపతి హత్య కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు జీవితఖైదు ఖరారు చేసింది. ఈ కేసులో గుర్మీత్ తోపాటు మరో ముగ్గురికి కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతోపాటు నలుగురికి రూ.50వేలు చొప్పున జరిమానా కూడా విధించింది.

తన ఇద్దరు మహిళా అనుచరుల (సన్యాసినిలు)ను అత్యాచారం చేసిన కేసులో గుర్మిత్ రామ్ రహీం సింగ్ ఇప్పటికే రోహతక్ సునరియా జైలులో 20 ఏండ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. గుర్మిత్ సింగ్ మహిళలను ఏ విధంగా లైంగిక వేధింపులకు గురిచేసేవాడో పూర్ సచ్ఛ్ న్యూస్ పేపర్‌లో జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి ప్రచురితం చేశారు. ఈ వార్తా ప్రచురణ అనంతరం జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి అక్టోబర్ 2002లో హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ప్రధాన కారకుడిగా గుర్మిత్ సింగ్ ఉన్నట్లుగా దర్యాప్తులో తేలింది.

1237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles