అత్తివరదరాజస్వామి ఉత్సవాల్లో అపశృతి

Thu,July 18, 2019 05:44 PM

Guntur woman died in kanchipuram athi varadar temple Celebrations

తమిళనాడు: కాంచీపురంలో అత్తివరదరాజస్వామి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు అపస్మారకస్థితిలోకి వెళ్లారు. ఆస్పత్రికి తరలింస్తుండగా ముగ్గురు భక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు భక్తులు కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కాగా తొక్కిసలాటలో ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన మహిళ నారాయణమ్మ మృతిచెందింది. స్వామివారి పురాతన విగ్రహాన్ని కోనేటి నుంచి ఆలయ అర్చకులు బయటకు తీసి ఓ చోట తాత్కాలికంగా ప్రతిష్టించి 48 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. అనంతరం కోనేటి అడుగుకు పంపించేస్తారు. ఇలా ప్రతీ 40 ఏళ్లకోసారి మాత్రమే కోనేటి నుంచి స్వామివారి విగ్రహాన్ని బయటకు తీసి పూజలు నిర్వహిస్తారు. ఇంతటి ప్రతిష్టత ఉన్న స్వామివారి ఉత్సవాల్లో భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు.

1339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles