వాజపేయి హిందీకి గుంటూరు ప్రజలు ఫిదా

Fri,August 17, 2018 12:14 PM

Guntur loved AB Vajpayee Hindi said no to translation

గుంటూరు : భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి హిందీకి గుంటూరు ప్రజలు ఫిదా అయిపోయారు. జనసంఘ్ అధ్యక్షుడిగా వాజపేయి ఓ కార్యక్రమం నిమిత్తం 1968లో గుంటూరుకు వచ్చారు. గుంటూరులో వీర్ సావర్కర్ విగ్రహ ప్రారంభం అనంతరం రోడ్డును ప్రారంభించారు వాజపేయి. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో వాజపేయి మాట్లాడారు. అయితే వాజపేయి హిందీలో ప్రసంగిస్తుంటే.. స్థానిక బీజేపీ నాయకుడు జూపుడి యజ్ఞ నారాయణ తెలుగులో అనువాదం చేశారు. అనర్గళంగా, అలవోకగా మాట్లాడుతున్న వాజపేయి ప్రసంగానికి అనువాదం ఆటంకం కలుగుతుందని భావించిన గుంటూరు ప్రజలు తమకు తెలుగు అనువాదం అక్కర్లేదని చెప్పారు. ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న గుంటూరు పట్టణంలో.. వాజపేయి హిందీలో అలవోకగా మాట్లాడుతుంటే.. అక్కడి జనాభా బాగా ఎంజాయ్ చేశారు. వాజపేయి హిందీ ప్రసంగానికి గుంటూరు ప్రజలు ఫిదా అయిపోయారు.

1569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles