పోలింగ్‌కు దూరంగా గుమ్ముడిపూండి గ్రామం

Thu,April 18, 2019 11:35 AM

Gummudipoondi residents boycotting the poll

చెన్నై : తమిళనాడులో 38 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే గుమ్ముడిపూండి గ్రామస్తులు మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దానికి కారణం.. ఐరన్‌ ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించడమే. ఐరన్‌ ఫ్యాక్టరీ వల్ల ఇక్కడ పర్యావరణానికి హానీ కలగడమే కాకుండా.. నీరు కలుషితమవుతుందని గ్రామస్తులు విజ్ఞప్తులు చేయడంతో కొన్నేళ్ల పాటు దాన్ని మూసివేశారు. మళ్లీ ఇటీవలే దాన్ని తిరిగి ప్రారంభించారు. దీంతో ఐరన్‌ ఫ్యాక్టరీని మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటూ వారు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుమ్ముడిపూండి గ్రామంలో దాదాపు 500 కుటుంబాలు ఉన్నాయి. ఆ గ్రామ సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. త్వరలోనే ఐరన్‌ ఫ్యాక్టరీని మూసివేస్తామని తహసీల్దార్‌, ఇతర అధికారులు గ్రామస్తులకు చెప్పినప్పటికీ వారు వినిపించుకోవడం లేదు. తాము ఓట్లేయామని తెగేసి చెబుతున్నారు. ఐరన్‌ ఫ్యాక్టరీని మూసివేయకపోతే ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్తామని గ్రామస్తులు చెప్పారు.

1207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles