గుజరాత్ ఎన్నికలకు ముగిసిన పోలింగ్..

Thu,December 14, 2017 05:18 PM

Gujarat Election polling concludes today


అహ్మదాబాద్ : గుజరాత్ శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. తొలి విడతలో 89 స్థానాలకు, ఇవాళ రెండో విడతలో 14 జిల్లాల్లోని 93 స్థానాలకు పోలింగ్ ముగిసింది. గుజరాత్‌లో సాయంత్రం 4గంటల వరకు 63 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నెల 18న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు 68. రెండో విడతలో పోలింగ్ జరిగిన 93 స్థానాలకు 851 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 2.22 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

1278
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles