గుజ‌రాత్ సీఎం విజ‌య్ రూపానీ ఘ‌న విజ‌యంMon,December 18, 2017 11:33 AM

గుజ‌రాత్ సీఎం విజ‌య్ రూపానీ ఘ‌న విజ‌యం

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్ సీఎం విజ‌య్ రూపానీ రాజ్‌కోట్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఘ‌న విజ‌యం సాధించారు. 25 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఇంద్ర‌నిల్ రాజ్‌గురుపై గెలిచారు. కౌంటింగ్ మొద‌లైన తొలి గంట‌న్న‌ర వ‌ర‌కు వెనుక‌బ‌డిన ఆయ‌న‌.. త‌ర్వాత అనూహ్యంగా పుంజుకున్నారు. ఒక ద‌శ‌లో ఇంద్ర‌నిల్ 6234 ఓట్ల మెజార్టీలోకి దూసుకెళ్లినా.. త‌ర్వాత వెనుక‌బ‌డిపోయారు. అటు డిప్యూటీ సీఎం నితిన్ ప‌టేల్ కూడా మొద‌ట్లో వెనుకంజ‌లో ఉన్నా.. త‌ర్వాత పుంజుకున్నారు. మెహ‌సానా నుంచి నితిన్ పోటీ చేస్తున్నారు.

1798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS