500 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ పట్టివేత

Wed,March 27, 2019 12:35 PM

Gujarat ATS AND Indian Coast Guard nab 9 smugglers with drugs worth 500 crore

హైదరాబాద్‌ : గుజరాత్‌ తీర ప్రాంతంలో రూ. 500 కోట్ల విలువ చేసే 100 కేజీల హెరాయిన్‌ను ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌(ఐసీజీ), యాంటీ టెర్రరిస్ట్‌ స్కాడ్‌(ఏటీఎస్‌) బృందాలు కలిసి స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ పోర్టులో ఇరానీయన్‌ పడవలో డ్రగ్స్‌ను నింపి సముద్ర మార్గం ద్వారా తరలిస్తున్నట్లు ఐసీజీ, ఏటీఎస్‌ బృందాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో ఈ బృందాలు గస్తీ నిర్వహించి ఇరానీయన్‌ పడవను అదుపులోకి తీసుకున్నాయి. 9 మంది ఇరాన్‌ దేశస్థులను అదుపులోకి తీసుకొని విచారించగా.. పాకిస్థాన్‌కు చెందిన హమీద్‌ మాలేక్‌ నుంచి ఈ డ్రగ్స్‌ను తీసుకున్నట్లు తెలిపారు. ఎట్టకేలకు పడవలో ఉన్న 100 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని ఐసీజీ, మెరైన్‌ టాస్క్‌ఫోర్స్‌ కమాండోస్‌ తెలిపారు. దీని విలువ రూ. 500 కోట్లు ఉంటుందన్నారు. అయితే ఆధారాలు దొరకకుండా పడవకు నిప్పు కూడా పెట్టారు ఇరానీయులు. డ్రగ్స్‌తో పట్టుబడ్డ 9 మంది ఇరానీయులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

1216
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles