అడవి మంటల కేసులో గైడ్ అరెస్ట్Tue,March 13, 2018 10:22 PM

అడవి మంటల కేసులో గైడ్ అరెస్ట్

థేని : తమిళనాడు పశ్చిమ కనుమల్లోని కురంగని అడవిలో పర్వతారోహకులకు గైడ్‌గా వ్యవహరించారని అనుమానిస్తున్న రంజిత్ (30)ని పోలీసులు అరెస్ట్ చేశారు. విషాదంగా మారిన ఈ పర్వతారోహణకు వసతులు సమకూర్చిన చెన్నైకి చెందిన సంస్థతో రంజిత్‌కున్న సంబంధాలపై తేల్చుకునేందుకు పోలీసులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. పర్వతారోహకులు రంజిత్‌కు ఎలా పరిచయమయ్యారనే దానిపై పోలీసులు పలువుర్ని విచారిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి దివ్య (29)ను మెరుగైన చికిత్స నిమిత్తం మదురై ప్రభుత్వ దవాఖానకు తరలించగా... చికిత్స పొందుతూ ఆమె మరణించింది.దీంతో మృతుల సంఖ్య 10 కి చేరింది. వీరిలో ఏడుగురు మహిళలు. మదురై ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న వారిని తమిళనాడు గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ పరామర్శించారు.

2870
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS