టీవీలు, కంప్యూట‌ర్ల‌పై త‌గ్గిన జీఎస్టీ

Sat,December 22, 2018 04:30 PM

న్యూఢిల్లీ : టీవీలు, కంప్యూట‌ర్లపై ప‌న్ను శాతాన్ని త‌గ్గించారు. సిమెంటు, ఆటో పార్ట్స్‌పై జీఎస్టీని త‌గ్గించ‌లేదు. ఇవాళ జీఎస్టీ మండ‌లి ఢిల్లీలో స‌మావేశ‌మైంది. అక్క‌డ మంత్రులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వెల్ల‌డించారు. కేవ‌లం విలాస‌వంత‌మైన వ‌స్తువులు మాత్ర‌మే 28 శాతం ప‌న్ను శ్లాబులో ఉంటాయ‌ని మంత్రి తెలిపారు. తాజా నిర్ణ‌యంతో కేవ‌లం 28 శాతం వ‌స్తువులు మాత్ర‌మే 28 శాతం ప‌న్ను శ్లాబులో ఉంటాయ‌ని జైట్లీ చెప్పారు. వ‌చ్చే జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో రియ‌ల్ ఎస్టేట్‌పై నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు ఉత్త‌రాఖండ్ మంత్రి ప్ర‌కాశ్ పంత్ తెలిపారు. 100 రూపాయ‌ల ధ‌ర ఉండే సినిమా టికెట్‌పై ప‌న్ను శాతాన్ని 12 శాతానికి త‌గ్గించిన‌ట్లు మంత్రి జైట్లీ తెలిపారు. వంద క‌న్నా ఎక్కువ ఉన్న టికెట్ ధ‌ర‌ల‌ను 28 శాతం నుంచి 18 శాతానికి త‌గ్గించిన‌ట్లు చెప్పారు. మానిట‌ర్లు, టీవీ స్క్రీన్లు, టైర్లు, ప‌వ‌ర్ బ్యాంకులు, లిథియ‌మ్ బ్యాట‌రీలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి త‌గ్గించారు. దివ్యాంగులు వాడే ప‌రిక‌రాల‌పై 5 శాతం ప‌న్ను వ‌సూల్ చేయ‌నున్నారు. జ‌న‌వ‌రి ఒక‌టి, 2019 నుంచి కొత్త జీఎస్టీ అమ‌లులోకి వ‌స్తుంద‌ని మంత్రి చెప్పారు.


2135
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles