మామా వ‌స్తున్నా.. చంద్ర‌యాన్‌2 స‌క్సెస్‌

Mon,July 22, 2019 03:04 PM

GSLV MkIII-M1 lifts-off from Sriharikota carrying Chandrayaan2

హైద‌రాబాద్‌: ఇండియా చ‌రిత్ర సృష్టించింది. భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఇస్రో).. ఇవాళ చంద్ర‌యాన్‌-2ను విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది. మ‌ధ్యాహ్నం 2.43 నిమిషాల‌కు ఆంధ్రప్ర‌దేశ్‌లోని శ్రీహ‌రికోట‌లోని స‌తీష్‌ధావ‌న్ సెంట‌ర్ నుంచి చంద్ర‌యాన్‌-2ను జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్ మోసుకెళ్లింది. నిప్పులు చిమ్ముతూ రాకెట్‌.. చంద్రుడి వైపు దూసుకువెళ్లింది. రాకెట్ బ‌రువు సుమారు 3850 కిలోల ఉంటుంది. ఆటోమెటిక్ లాంచ్ సీక్వెన్స్‌ను ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు ప్రారంభించారు. క్ర‌యోజ‌నిక్ స్టేజ్ అనుకున్న‌ట్టే ప్ర‌జ్వ‌లించింది.
ఇస్రో చైర్మ‌న్ శివ‌న్‌తో పాటు ఇత‌ర శాస్త్ర‌వేత్త‌లు మిష‌న్ కంట్రోల్ రూమ్ నుంచి చంద్ర‌యాన్‌-2 ప్ర‌యోగాన్ని వీక్షించారు. వీవీఐపీలు కూడా ఎక్కువ మందే ఈ ఈవెంట్‌ను ప్ర‌త్య‌క్షంగా చూశారు. అత్యంత శ‌క్తివంత‌మైన ఈ రాకెట్ సుమారు 43.5 మీట‌ర్ల ఎత్తు ఉన్న‌ది. చంద్ర‌యాన్‌లో విక్ర‌మ్ ల్యాండ‌ర్‌, ప్ర‌జ్ఞ రోవ‌ర్ ఉన్నాయి. రోవ‌ర్ అక్క‌డ ఉప‌రిత‌లంపై ప‌లు అన్వేష‌ణ‌లు చేయ‌నున్న‌ది. జాబిలిపై నీట జాడ క‌నుకొనేందుకు ఇదో పెద్ద ప్ర‌యోగంగా భావిస్తున్నారు.

ఇస్రో వ్య‌వ‌స్థాప‌కుడు విక్ర‌మ్ సారాభాయ్ పేరుతో చంద్ర‌యాన్ ల్యాండ‌ర్‌కు విక్ర‌మ్ పేరు పెట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు అమెరికా, ర‌ష్యా, చైనాలు మాత్ర‌మే .. చంద్రుడిపై రోవ‌ర్‌ను దింపాయి. ఈ ప్ర‌యోగంతో జాబిలిపై రోవ‌ర్‌ను దింపిన నాలుగ‌వ దేశంగా భార‌త్ చ‌రిత్ర సృష్టించ‌నున్న‌ది. మార్క్ త్రీ రాకెట్‌.. చంద్ర‌యాన్‌ను అనుకున్న‌ట్లే విజ‌య‌వంతంగా భూక‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టింది. చంద్రుడి ద‌క్షిణ ద్రువంపై చంద్ర‌యాన్‌2 దిగ‌నున్న‌ది.

1913
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles