బైక్ కోసం డిమాండ్.. వరుడికి గుండు..

Mon,October 22, 2018 11:45 AM

Groom head tonsured allegedly because he refused to marry the bride in lucknow

లక్నో : ఓ నూతన వరుడికి గుండు గీయించారు.. ఎందుకో తెలుసా! పెళ్లికి ఐదు రోజుల ముందు ఆ నూతన వరుడు.. వధువు కుటుంబం ముందు కొత్త డిమాండ్లు ఉంచాడు. బైక్ ఇప్పించాలి. బంగారు గొలుసు చేయించాలని డిమాండ్ చేశాడు. మొత్తానికి బైక్, బంగారం గొలుసు ఇవ్వలేమని వధువు కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు. అయితే తాను కూడా పెళ్లి చేసుకోనని వరుడు మొండికేశాడు. దీంతో పెళ్లి కుమారుడికి గుండు గీయించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వధువు అమ్మమ్మ మాట్లాడుతూ.. పెళ్లికి ఐదు రోజుల ముందు తనకు బంగారు గొలుసు, బైక్ కొనివ్వాలని వరుడు డిమాండ్ చేశాడు. ఇందుకు తాము ఒప్పుకోలేదు. గుండు ఎవరు కొట్టించారో తమకు తెలియదని ఆమె స్పష్టం చేసింది.

4392
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles