శ్రీనగర్ లో గ్రేనెడ్ తో దాడి

Fri,January 18, 2019 02:54 PM

Grenade blast at Srinagar Ghanta Ghar Chowk

జమ్మూకశ్మీర్ : శ్రీనగర్ లోని ఘంటా గర్ ఏరియాలో శుక్రవారం మధ్యాహ్నం గ్రేనెడ్ దాడి జరిగింది. సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా గుర్తు తెలియని దుండగులు గ్రేనెడ్ తో దాడి చేసి పారిపోయారు. గడిచిన 24 గంటల్లో గ్రేనెడ్ దాడి జరగడం ఇది రెండోసారి. ఇవాళ మధ్యాహ్నం జరిగిన దాడిలో భద్రతా బలగాల వాహనాలు, పలు దుకాణాలు ధ్వంసం అయ్యాయి. ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. గురువారం శ్రీనగర్ లోని జీరో బ్రిడ్జి వద్ద జరిగిన గ్రేనెడ్ దాడిలో ఆరుగురు గాయపడిన విషయం తెలిసిందే. వీరిలో ముగ్గురు పోలీసులు ఉన్నారు. ఉగ్రవాదులే గ్రేనేడ్ దాడులు చేశారని పోలీసులు భావిస్తున్నారు.825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles