ఒక్కరోజులో 175 టన్నుల చెత్తను ఏరేశారు

Fri,October 13, 2017 03:10 PM

Greater Chennai Corporation cleans 175 tonnes of wastage in one day as anti dengue drive

ఓ 10 మంది కలిస్తే ఈ ప్రపంచంలో చేయలేని పనంటూ ఏదీ ఉండదని నిరూపించింది గ్రేటర్ చెన్నై కార్పొరేషన్. ఒక్కరోజులోనే 175 టన్నుల చెత్తను ఏరేసి చరిత్ర సృష్టించింది. అయితే... అంత పెద్ద మొత్తంలో చెత్తను ఏరేయడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. అదేంటో తెలుసుకుందాం పదండి...

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చాలా ప్రాంతాల్లో వైరల్ ఫ్లూ జ్వరాలు, జలుబు, దగ్గు లాంటివి వాతావరణంలో ఈజీగా వ్యాపిస్తాయి. వాటిని పక్కన బెడితే ఇంకో అతిభయంకరమైన వ్యాధి డెంగీ. వర్షాకాలంలో ఎక్కువగా సోకుతుంది. దోమకాటు వల్ల వచ్చే ఈ వ్యాధి.. కేరళ, కర్ణాటక తర్వాత తమిళనాడులో విజృంబిస్తున్నది. దీంతో తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్, తిరుచి, డిండిగుల్, కరూర్ లాంటి ప్రాంతాల్లో డెంగీ మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. తమిళనాడు హెల్త్ డిపార్ట్‌మెంట్ లెక్కల ప్రకారం ఒక్క చెన్నైలోనే ప్రతిరోజు 30 డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి.

డెంగీ మరణాలను అరికట్టడం ఎలా అనే ఆలోచనలో పడింది గ్రేటర్ చెన్నై కార్పొరేషన్. దీంతో మాస్ క్లీనింగ్ డ్రైవ్‌ను ప్రారంభించింది. దోమలు విస్తృతంగా సంచరించే ప్రాంతాలయినటువంటి పాతబడిన వాహనాలు, డ్యామేజ్ వాహనాలు లాంటి వాటిని తీసేయాలని ప్రజలకు సూచించింది.

కార్పొరేషన్ కమిషనర్ డీ కార్తికేయన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ వర్కర్స్ అంతా కలిసి గురువారం మాస్ క్లీనింగ్ ప్రారంభించారు. మొత్తం 200 టీములుగా ఏర్పడి.. 2825 మలేరియా వర్కర్స్, 14902 మంది సంరక్షక సిబ్బంది కలిసి ఈ మాస్ క్లీనింగ్ డ్రైవ్‌లో పాలుపంచుకున్నారు. మొత్తం 331 ఫాగ్ మిషన్లను ఈ డ్రైవ్‌లో ఉపయోగించారు.

ఇంకా.. సివిక్ బాడీ 76 మెడికల్ క్యాంపుల ఏర్పాటు చేసింది. ఆ క్యాంపులో కొన్ని డెంగీ కేసులను గుర్తించింది. నిరుపయోగంగా ఉన్న వెహికిల్స్ దోమలకు కేంద్రాలని.. అటువంటి వాహనాల యజమానులకు రూ.51,000 ఫైన్ వేసినట్లు కార్పొరేషన్ అధికారి తెలిపారు. ఒక్క రోజులో కార్పొరేషన్ సిబ్బంది అంతా కలిసి చెన్నై మొత్తం మీద నిరుపయోగమైన, పనికిరాని వాహనాలతో కలిపి దోమలకు నిలయాలైన మొత్తం 175 టన్నుల చెత్తను ఏరేశారు.


3053
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS