ఆర్‌బీఐ డబ్బు తరలిస్తున్న బోగీలకు రంధ్రం

Tue,August 9, 2016 06:34 PM

Great train robbery in Tamilanadu

చెన్నై : ఆర్‌బీఐ డబ్బు తరలిస్తున్న ఓ రైలు బోగీలకు గుర్తు తెలియని దుండగులు రంధ్రం చేశారు. ఈ ఘటన విరుదాచలం రైల్వేస్టేషన్ వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్టేషన్‌లో ఆగిన సమయంలో వెల్డింగ్ సహాయంతో బోగీలకు రంధ్రం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సేలం నుంచి చెన్నైలోని రిజర్వు బ్యాంక్‌కు నగదు తరలిస్తున్న రెండు బోగీలకు రంధ్రం చేశారు. 220 కాటన్స్‌లలో రూ. 340 కోట్ల డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నగదు డబ్బాల మూతలు తెరిచిన ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రైలు డబ్బాల నుంచి డబ్బులు దొంగిలించారా? లేదా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

70
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles