రాఫెల్ వస్తే, సీన్ మారుతుంది : ఎయిర్ చీఫ్ మార్షల్

Wed,October 3, 2018 01:56 PM

Govt took a bold step and bought 36 Rafale aircraft, says Air Chief Marshal BS Dhanoa

న్యూఢిల్లీ: ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా.. ఇవాళ మీడియాతో మాట్లాడారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. రాఫెల్ ఓ మంచి యుద్ధ విమానం అని ఆయన తెలిపారు. ఆ విమానం ఆసియా ఉపఖండంలోకి వస్తే, అది ఇక్కడి పరిస్థితులనే మార్చేస్తుందని అన్నారు. రాఫెల్‌తో అనేక లాభాలు ఉన్నాయని ఎయిర్ మార్షల్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)కు కాకుండా.. కొత్తగా వచ్చిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు రాఫెల్ ఒప్పందాన్ని ఎలా కట్టబెట్టారని ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ వైమానిక దళాధిపతి బీఎస్ ధనోవా దానిపై క్లారిటీ ఇచ్చారు. రాఫెల్ ఒప్పందం రెండు ప్రభుత్వాల మధ్య జరిగిందని, అది రెండు స్కాడ్రెన్లు తీసుకున్న నిర్ణయమన్నారు. ఎమర్జెన్సీ అవసరాల కోసం ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీ కోసం హెచ్‌ఏఎల్ ప్రయత్నించిందని, లైసెన్సు తీసుకుని ఉత్పత్తి చేయాలని హెచ్‌ఏఎల్ నిర్ణయించిందన్నారు. అయితే రాఫెల్ తయారీ ఒప్పందంలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థను ఎప్పడూ పక్కనపెట్టలేదని ధనోవా తెలిపారు.

రాఫెల్ యుద్ధ విమానాల సంఖ్యను ఎందుకు తగ్గించారన్న అంశంపైన కూడా ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. ఐఏఎఫ్ అధికారుల స్థాయిలో ఆ నిర్ణయం జరిగిందని, వైమానిక దళ అధికారులు ఇచ్చిన ఆప్షన్ ప్రకారమే ప్రభుత్వం రాఫెల్ కొనుగోలుకు సిద్ధమైందన్నారు. వైమానిక దళంలో ప్రమాదాలను నివారించేందుకు వైమానిక దళం నిత్యం అనేక ప్రయత్నాలు చేస్తున్నదని, వైమానిక సంపదను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయితే విమానాలను అందించడంలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆలస్యం చేస్తుందని ధనోవా ఆరోపించారు. సుఖోయ్-30 యుద్ధ విమానం జారీలో మూడేళ్ల జాప్యం జరిగిందని, జాగ్వార్ విమానం తయారీలోనూ ఆరేళ్ల ఆలస్యం జరిగిందని, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీలోనూ అయిదేళ్ల ఆలస్యం జరిగిందన్నారు. మిరేజ్ 2000 మోడల్ అప్‌గ్రేడ్‌లోనూ జాప్యం పెరుగుతోందని ఎయిర్ మార్షల్ ధనోవా చెప్పారు. భారత వైమానిక దళంలో తగ్గుతున్న స్కాడ్రన్లు(విమాన దళాలు) ఆందోళనకరంగా మారిందని ఆయన అన్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన 24 గంటల్లోనే ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ వ్యవస్థ భారత్‌కు వస్తుందన్నారు.

1565
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles