HomeLATEST NEWSGovt reduces rate of contribution ESI scheme

ఈఎస్ఐ లబ్దిదారులకు తీపికబురు

Published: Thu,June 13, 2019 08:52 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

న్యూఢిల్లీ: ఈఎస్ఐ (కార్మిక రాజ్య భీమా సంస్థ) లబ్దిదారులకు కేంద్రప్రభుత్వం తీపికబురు అందించింది. ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సభ్యత్వ రుసుమును తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇప్పటివరకు ఈఎస్‌ఐ చట్టం కింద వసూలు చేస్తున్న మొత్తాన్ని 6.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది. సాధారణంగా సభ్యత్వ రుసుములో కొంతభాగాన్ని ఉద్యోగి చెల్లిస్తే..మిగతా మొత్తాన్ని సంస్థ యాజమాన్యం చెల్లిస్తుంది. దీని ప్రకారం యాజమాన్య వాటాను 4.75 నుంచి 3.25 శాతానికి తగ్గించగా..ఉద్యోగి సభ్యత్య వాటాను 1.74 నుంచి 0.75కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా సవరించిన రుసుములు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.
4317
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology