రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సమావేశం

Tue,February 9, 2016 10:58 AM

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ గవర్నర్ల సమావేశానికి వేదికైంది. ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, నీతి ఆయోగ్ ఛైర్మన్ అరవింద్ పనగరియా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. రెండు రోజులపాటు సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తోపాటు, తమిళనాడు గవర్నర్ రోశయ్య, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావుతోపాటు పలు రాష్ర్టాల గవర్నర్లు హాజరయ్యారు.

964
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles