అప్పుడు సీటు.. ఇప్పుడు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం త్యాగం!

Thu,May 17, 2018 05:10 PM

Governor sacrifices Constitution for Modi says Congress

న్యూఢిల్లీ: కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలాపై విరుచుకుపడింది కాంగ్రెస్. రాజ్యాంగాన్ని ఆయన రెండుసార్లు ఎన్‌కౌంటర్ చేశారంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తీవ్రంగా మండిపడ్డారు. అప్పుడు మోదీ కోసం గుజరాత్‌లో తన సీటు త్యాగం చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్నే ఆయన త్యాగం చేశారు. బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించి తొలిసారి రాజ్యాంగాన్ని గవర్నర్ ఎన్‌కౌంటర్ చేశారు. ఇవాళ యడ్యూరప్పతో ప్రమాణస్వీకారం చేయించి రెండోసారి ఎన్‌కౌంటర్ చేశారు అని సూర్జేవాలా విమర్శించారు. యడ్యూరప్పకు సీఎం పీఠం ఒక రోజు ముచ్చటేనని, అందులోనూ సగం రోజు గడిచిపోయిందని ఆయన అన్నారు.


2946
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles