కర్ణాటక రాజ్‌భవన్ నుంచి వెలువడిన అధికారిక ప్రకటన

Wed,May 16, 2018 09:54 PM

Governor has invited BS Yeddyurappa to form govt in karnataka

బెంగళూరు: రేపు యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని.. గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీని ఆహ్వానించారని బీజేపీ కర్ణాటక సాయంత్రమే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. అప్పుడు అధికారికంగా గవర్నర్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. తర్వాత గవర్నర్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ యడ్యూరప్పకు లేఖ రాశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ లేఖలో రాశారు. అయితే.. అసెంబ్లీలో బలనిరూపణ కోసం 15 రోజుల గడువు ఇస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. దీంతో యడ్యూరప్ప రేపు ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

4491
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles