జీఎస్టీ వసూళ్లు నెలకు లక్ష కోట్లు!Tue,February 13, 2018 04:26 PM
జీఎస్టీ వసూళ్లు నెలకు లక్ష కోట్లు!

న్యూఢిల్లీః గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) ద్వారా నెలకు రూ.లక్ష కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తున్నది. ఇప్పటికే పన్ను ఎగ్గొట్టే వారికి చెక్ పెట్టే చర్యలు తీసుకుంటున్నది. అది సమర్థంగా అమలు చేసిన తర్వాత నెలకు లక్ష కోట్లు రాబట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. జీఎస్టీ ఫైలింగ్ ప్రక్రియ గాడిలో పడిన తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అనలిటిక్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ రంగంలోకి దిగనుంది. జీఎస్టీ ఫైల్ చేసేవాళ్ల ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ను ఎప్పటికప్పుడు సరిచూడనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7.44 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం వెల్లడించింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో గత జులై నుంచి ఫిబ్రవరి వరకు రూ.4.44 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు చేశారు. జీఎస్టీ తొలిసారి అమలు చేసిన జులైలో అత్యధికంగా రూ.95 వేల కోట్లు రాగా.. ఆ తర్వాత నెలల్లో అది తగ్గుతూ వస్తున్నది. నవంబర్‌లో అతి తక్కువగా రూ.80 వేల కోట్లే వసూలయ్యాయి. గతేడాది డిసెంబర్‌నాటికి 98 లక్షల మంది వ్యాపారులు జీఎస్టీ కింద నమోదు చేసుకున్నారు. జీఎస్టీలో చూపిన టర్నోవర్, వాళ్లు ఫైల్ చేసే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌తో పోల్చి చూస్తామని, వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం నుంచి ఈ పని మొదలవుతుందని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. ఆ తర్వాత నెలకు లక్ష కోట్ల జీఎస్టీ కచ్చితంగా సాధ్యమవుతుందని ఆయన స్పష్టంచేశారు.

2855
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Union Budget 2018